ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఆశాజ్యోతి అమరజీవి పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర అవోపా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్వేటి నిర్మల అన్నారు. గురువారం కర్నూల్ నగరంలోని పొట్టి శ్రీరాములు పార్క్ లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి కర్నూలు అవోపా అధ్యక్షులు యుగేందర్ శెట్టి తో కలిసి పూలమాల లేసి నివాళులర్పించారు. చీఫ్ కన్వీనర్ నాగేశ్వరరావు ఉన్నారు.