దొంగ బంగారం కొన్నారనే అనుమానంతో పట్టణానికి చెందిన ముగ్గురు వ్యాపారులను బుధవారం సాయంత్రం కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. నందవరం మండలం సోమలగూడూరుకు చెందిన షేక్షావలి, కలందర్ లు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా ఎరిగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం చోరీ చేశారు. వారిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారిం చగా బంగారం ఎమ్మిగనూరులో విక్రయించి నట్లు చెప్పారు. దీంతో నిందితులను వెంటబె ట్టుకుని ఎమ్మిగనూరు టౌన్ పోలీసుల సహకా రంతో ఎరిగేరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగారం బంగారు కొన్న వ్యాపారుల వద్దకు చేరుకు న్నారు. ముగ్గురు వ్యాపారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా అదుపులోకి తీసుకున్న సమయంలో కర్ణాటక పోలీసులతో బంగారు వ్యాపారులు, అసోసియేషన్ సభ్యులు వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.