కుటుంబ రాజకీయాలను విమర్శించే వారికి తన అద్భుత పనితీరు ద్వారా సమాధానం చెబుతానని తమిళనాడు మంత్రి ఉదయనిధి వ్యాఖ్యానించారు. తమిళనాడు సీఎం కుమారుడైన ఉదయనిధి చపాక్-తిరువళ్లికేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించగా బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఈయనకు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖను డీఎంకే సర్కార్ కేటాయించింది. తమిళనాడు రాష్ట్రాన్ని దేశానికే క్రీడా రాజధానిగా తీర్చిదిద్దుతానని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు.