పులివెందుల నియోజకవర్గం లో విచ్చలవిడిగా జరుగుతున్న మట్కా జూదంపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బీటెక్ రవి గ్రామదర్శిని కి వచ్చిన జిల్లా కలెక్టర్ విజయ రామరాజు కు బుధవారం బలపనూరులో వినతిపత్రం అందజేశారు. మట్కా జూదంపై ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు తెలియజేసినందుకు తమ వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనయించారన్నారు. చీనీ రైతులకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్ లు, జ్యూస్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని ఆయన కలెక్టర్ ను కోరారు.