అద్దెకు ఉంటున్న ఓ యువకుడిని ఇంటి యజమాని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి గంగా నదిలో పడేసిన ఘటన యూపీలో జరిగింది. అంకిత్ ఖోకర్ అనే వ్యక్తి కొద్దిరోజులుగా మోదీనగర్ లోని ఉమేశ్ శర్మ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకుంటున్నాడు. కొన్ని నెలల క్రితం రూ.60 లక్షలను ఉమేశ్ కు అంకిత్ అప్పుగా ఇచ్చాడు. ఈ క్రమంలో అంకిత్ కు ఎవరూ లేరని తెలుసుకున్న ఉమేశ్ మరో ఐదుగురితో కలిసి అంకిత్ ను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి నదిలో పడేశాడు. అంకిత్ అదృశ్యంపై అతని మిత్రులు ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో అసలు విషయం వెల్లడైంది. దీంతో పోలీసులు ఉమేశ్ సహా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.