కర్ణాటక, మహారాష్ట్ర ల సరిహద్దు పంచాయితీ కేంద్రం వద్దకు చేరింది. ఇరు రాష్ట్రాల సీఎంలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల మంత్రులతో ఆరుగురు సభ్యుల కమిటీని నియమించాలని, ఇలాంటి వివాదాలు చట్టబద్ధంగానే పరిష్కారమవుతాయని అన్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేయెద్దని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. కాగా, కర్ణాటకలో సరిహద్దు వివాదంపై ఇటీవల హింస చెలరేగడంతో అమిత్ షా ఇరు రాష్ట్రాల సీఎంలను పిలిపించారు.