భూమి వేడెక్కి.. మంచు పర్వతాలు కరిగి నీళ్లలా మారి సముద్రాలు పరుగులు పెడుతున్నాయి. మరి, పరిస్థితులకు అనుగుణంగా ఆ నీళ్లు ఎలా మారుతున్నాయి? అని తెలుసుకునేందుకు ‘నాసా’ సిద్ధమైంది. ‘భూ ఉపరితల నీరు, సముద్రాల వ్యవస్థ (స్వాట్)’ పేరుతో అంతరిక్షంలోకి ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ సాయంతో రాడార్ శాటిలైట్ పంపనుంది. ఈ ప్రయోగం ద్వారా భూమిపై సముద్రాలు, సరస్సులు, నదులు, ఇతర నీటి వనరుల గురించి ఇప్పటివరకూ తెలియని విషయాలు తెలుసుకునేందుకు వీలవుతుంది. ఈ ప్రయోగానికి గురువారం వాండర్ బర్గ్ యూఎస్ స్పేస్ ఫోర్స్ బేస్ ను సిద్ధం చేశారు.