బంగారు నగలు ఉన్న బ్యాగును ఓ ప్రయాణికురాలు హోటల్ లో మరచి పోగా మరో ప్రయాణికురాలు ఆ నగల బ్యాగును పోలీసులకు అప్ప గించి తన నిజాయితీని చాటుకున్న సంఘటన బుధవారం గుత్తి పట్ట ణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు గుత్తి మండలం ఇసురాలపల్లి గ్రామానికి చెందిన అరుణ జ్యోతి ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ హోటల్ లో మరచి రైల్వే స్టేషన్కు వెళ్ళిపోయింది. ఐతే అక్కడికి వెళ్లిన తర్వాత తన బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనతో హోటల్ కు తిరిగివచ్చి విచారిం చింది. ఐతే హాండ్ బ్యాగు లభించక పోవడంతో చోరీకి గురైందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బ్యాగులో 8 తులాల బంగారు ఆభర ణాలు ఉన్నాయని ఆమె బోరున విలపించింది. వెంటనే పోలీసులు హోటల్ కు వెళ్లి విచారిస్తుండగా మాబూని అను ప్రయాణికురాలు తనకు బ్యాగు దొరికిందని పోలీసు లకు అప్పగించింది. అందులో తన నగలు అన్నీ ఉండడంతో అరుణ జ్యోతి ఆనందం వ్యక్తం చేసింది. దీంతో నగల బ్యాగును అందజేసిన మాబున్నీ ని సిఐ వెంకట రామిరెడ్డి అభినందించారు.