ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరనీయుడని టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతి నిధి ఆర్. పవన్ కుమార్ గౌడు కొనియాడారు. గురువారం గుంత కల్లు పట్టణంలోని టిడిపి కార్యాల యంలో నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహిం చి ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి ఘన నివాళులు అర్పిం చారు. ఈ సందర్బంగా పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర అవత రణ జరిగిందన్నారు. అలాంటి మహనీయులను స్మరించుకోవడం ఆంధ్ర ప్రజల అదృష్టం అన్నారు. పొట్టి శ్రీరాములును యువత ఆద ర్శంగా తీసుకుని ఆయన ఆశయా లను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ, మండల తెలుగుదేశం పార్టీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.