కడప విమానాశ్రయానికి పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ కారణంగా టెర్మినల్ భవనం విస్తరించాలని ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ సంజీవ్ కుమార్ కు ఢిల్లీలో బుధవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతమున్న ఎయిర్పోర్ట్ టెర్మినల్
భవనం చాలా చిన్నగా ఉందని ఆయనకు తెలిపారు. ఎంపీ చేసిన విజ్ఞప్తికి ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ స్పందించి దీని ప్రతిపాదనను ఫైనాన్షియల్ బడ్జెట్ లోనే పెడతామని హామీ ఇచ్చారు.