పెద్దముడియం మండలంలోని పెద్దపసుపుల గ్రామం లో ప్రజలు విషజ్వరాలతో బాధ పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి గురువారం గ్రామాన్ని పరిశీలించి ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించడం జరిగింది. గ్రామస్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఎమ్మెల్యే తెలియజేశారు. గ్రామంలో పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులకు సూచించారు.