స్పా సెంటర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీలోని రిషబ్ విహార్ లోని స్పా సెంటర్ లో పోలీసులు దాడులు చేశారు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న నిందితుడు రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ దాడిలో ఏడుగురు థాయ్ మహిళలతో పాటు ఐదుగురు భారతీయ మహిళలు పట్టుబడ్డారు. అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం & విదేశీయుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.