ఐరాస భద్రతా మండలి బహిరంగ చర్చ వేదికగా చైనా, పాకిస్థాన్ లపై విదేశాంగ మంత్రి జైశంకర్ పరోక్ష విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ శాంతి, భద్రత నిర్వహణ, బహుపాక్షికత కొత్త ధోరణిపై ఐరాసలో బహిరంగ చర్చకు భారత్ తరఫున జైశంకర్ అధ్యక్షత వహించారు. పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి తీవ్రవాదులను బ్లాక్ లిస్ట్ లో చేర్చాలనే ప్రతిపాదనలను వీటో అధికారంతో చైనా పదే పదే అడ్డు పడడంపై పరోక్షంగా చురకలంటించారు. ఐరాసలో పదే పదే కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రస్తావించడంపై జైశంకర్ మండిపడ్డారు. పొరుగు దేశ పార్లమెంట్ పై దాడి సంబరాలు చేసుకోవడానికి యోగ్యతలు కావని బదులిచ్చారు.