మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతులు AK47 గన్లు పట్టుకొని ప్రగతి భవన్ కు తరలివెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పొలం ఉండి, అమెరికాలో వ్యాపారాలు చేసుకునే వారి అకౌంట్లలో రైతుబంధు నగదు లక్షల్లో జమ చేస్తున్నారని, కానీ కౌలు రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డబ్బున్న వాళ్లకి రైతుబంధు ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. కౌలు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.