ముందస్తు అనుమతి లేకుండా తమ రాష్ట్రాల్లో కేసులను దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని 9 రాష్ట్రాలు నిరోధించాయని కేంద్రం బుధవారం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, మేఘాలయ, మిజోరం, పంజాబ్ రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని మంత్రి జితేంద్ర సింగ్ సభలో పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో బేదాభిప్రాయాలు, ఇతరత్రా ప్రత్యేక కారణాలు చూపుతూ కొన్ని రాష్ట్రాలు సీబీఐకి అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.