ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య వేధింపులతో నవ వరుడు ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Thu, Dec 15, 2022, 12:42 PM

కుటుంబ గొడవలతో నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగుళూరులోని ఉళ్లాల ఎంవీ లేఔట్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన మహేశ్వర (25)కు 3 నెలల క్రితం కవన అనే యువతితో వివాహం జరిగింది. 5 రోజుల క్రితం మహేశ్వర తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కవన తరచూ భర్తతో గొడవ పడేదని, ఆమె వేధింపులు తాళలేకే మహేశ్వర ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com