బీసీ కులాలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంటులో బిల్ల ప్రవేశ పెట్టేవరకు తాము పోరాటాన్ని ఆపేది లేదని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. బీసీ బిల్లు ప్రవేశ పెట్టకుంటే కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రధాని మోదీ బీసీ వర్గానికి చెందిన వారని, బీసీ ప్రధాని ఉన్నప్పుడే బీసీ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాజకీయాలకు అతీతంగా బీసీ నేతలంతా ఈ బిల్లుకు మద్దతివ్వాలని ఆయన కోరారు.