నిపుణులు కాని సాధారణ విదేశీ కార్మికులకు అమెరికాలో పని చేయడానికి తొలిసారిగా అదనంగా 64,716 తాత్కాలిక వీసాలను మంజూరు చేయనున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. ఈ వీసాలను హెచ్ 2బీ వీసాలుగా పేర్కొంటారు. 2023లో అమెరికన్ వ్యాపార సంస్థలకు సాధారణ కూలీలను అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో పరిమిత కాలంపాటు వ్యవసాయేతర పనులు, సేవలందించడం కోసం ఈ వీసాలిస్తారు. అయితే వీటి వల్ల భారతీయులకు పెద్ద ప్రయోజనం ఉండదని నిపుణులు భావిస్తున్నారు.