శనగ పైరులో ఎండు తెగులు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొరిసపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం నాడు లోకల్ యాప్ తో మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షం కారణంగా నేలలో తేమ శాతం అధికమై పూజారియం విల్ట్ సోకి మొక్కలు ఎండిపోయే అవకాశం ఉందని అన్నారు. దీని నివారణకు కార్బండ జిమ్, కాపర్ ఆక్సి క్లోరైడ్ ముందును పిచికారి చేయాలని శ్రీనివాసరావు సూచించారు. శనగ పచ్చ పురుగు నివారణకు ఎసిఫేట్ పురుగుమందు చల్లాలని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక దశలోనే సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా నష్ట తీవ్రత తగ్గించవచ్చని శ్రీనివాసరావు తెలియచేశారు.