దేశవ్యాప్తంగా 1,472 ఐఏఎస్, 864 ఐపీఎస్, 1,057 ఐఎఫ్ఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రకటించింది. 2022 జనవరి 1 నాటికి దేశంలో శాంక్షన్డ్ ఐఏఎస్ పోస్టులు 6,789, ఐపీఎస్ 4,984, ఐఎఫ్ఎస్ పోస్టులు 3,191 ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్ సభలో తెలియజేశారు. ప్రస్తుతం 5,371 ఐఏఎస్, 4,120 ఐపీఎస్, 2,134 ఐఎఫ్ఎస్ అధికారులు పని చేస్తున్నారని వెల్లడించారు. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.