మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి 7వేల క్యూసెక్కుల మేరకు నీటి విడుదల చేస్తున్నట్లు జలాశయ ఏఈ ఈ గౌతమ్ రెడ్డి గురువారం తెలిపారు. గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశంలోకి 7వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అలాగే దక్షిణ కాలువకు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మైలవరం జలాశయం పూర్తి సామర్థ్యం 6. 500 టిఎంసిలు కాగా ప్రస్తుతం 6 టీఎంసీల నీరు నిలువ ఉంది. గండికోట జలాశయం నుంచి మైలవరానికి ఇన్ఫ్లో పెరిగినతే పెన్నా నదికి మరింత నేటి విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.