భారత సంతతికి చెందిన యువకుడు అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్టెన్ గేట్ బ్రిడ్జి పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పన్నెండో తరగతి చదువుతున్న 16 ఏళ్ల ఇండియన్ అమెరికన్.. బుధవారం సాయంత్రం బ్రిడ్జి పైనుంచి దూకాడని అమెరికా కోస్టల్ గార్డ్స్ అధికారులు తెలిపారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ వంతెనపై ఓ భారతీయ అమెరికన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఇది నాలుగోసారని ఎన్నారై అజయ్ జైన్ భూటోరియా తెలిపారు. కాగా, 1937లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి పైనుంచి ఇప్పటివరకూ 2 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు.