రాజంపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఇంటర్ స్కూల్ బ్యాండ్ కాంపిటీషన్స్ 2022-2023 ను కడప ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాంపిటేషన్ లో ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. ఇందులో మునిసిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవ రెడ్డి , జెడ్పీటీసీ దాసరి పెంచలయ్య, డీసీఎంఎస్ చైర్మన్ దండు గోపి, మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి తదితరులు ఉన్నారు.