భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్‌తో విభేదాల కారణంగా విడాకులకు సిద్ధమయ్యారనే వార్తలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై గతంలో షోయబ్ స్పందించినప్పటికీ గాసిప్స్ నడుస్తూనే ఉన్నాయి. తాజాగా షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయో చూసి ఆయన ఇచ్చిన కొత్త ట్విస్ట్‌కు అంతా ఆశ్చర్యపోతున్నారు. తన ఇన్‌స్టా బయోలో తాను సూపర్‌వుమన్ సానియా మిర్జాకు భర్తను అంటూ రాసుకొచ్చారు షోయబ్. ‘అథ్లెట్, సూపర్‌వుమన్ సానియామిర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రి’ అని పేర్కొన్నారు. దీంతో షోయబ్ విడాకుల వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు.