దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నిర్భయ' ఘటన జరిగి నేటికి సరిగ్గా పదేళ్లు. డిసెంబర్ 16 2012న దేశరాజధాని ఢిల్లీలో ఐదుగురు నిందితులు బస్సులో నిర్భయపై దారుణానికి పాల్పడ్డారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె ప్రైవేటు పార్టుల్లో ఇనుపరాడ్ ను చొప్పించి పైశాచిక ఆనందం పొందారు. అనంతరం ఆమెను కదులుతున్న బస్సులోంచి బయటకు విసిరేసారు. బాధితురాలు కొద్దిరోజులు చావుతో పోరాడి కన్నుమూసింది. దీంతో ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి నిందితులను ఉరితీయాలంటూ నిరసనలు చేశారు. నిందితుల్లో ఒకరు జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మిగతా నలుగురిని ఉరి తీశారు.