ఏపీలోని కర్నూలు జిల్లాలో యూపీహెచ్సీ/ పీహెచ్సీ పరిధిలో ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు గడువు నేటితో (శుక్రవారం) ముగియనుంది. మొత్తం 61 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్ పాసైన వారు అర్హులు. వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను సంబంధిత యూపీహెచ్సీ/ పీహెచ్‌సీల్లోని మెడికల్ ఆఫీసర్ కు అందజేయాలి. అకడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10వేలు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు లాస్ట్ డేట్ డిసెంబర్ 16, 2022.