కొంత మంది తమకు ఆడపిల్ల పుట్టిందని ఎంతో బాధపడుతుంటారు. కానీ ఆడపిల్ల పుట్టిందన్న సంతోషంతో తల్లిదండ్రులు పాపను రథంపై ఊరేగించిన ఘటన పంజాబ్ లో జరిగింద. అమృత్ సర్ కు చెందిన సాగర్, జాన్వి దంపతులకు రెండు రోజుల క్రితం ఆడబిడ్డ జన్మించింది. దీంతో వారు పాపను ఆసుపత్రి నుండి రథంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. బ్యాండు బాజాలతో, బంధువుల కోలాహలం మధ్య దీన్ని వేడుకలా చేశారు. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని తాము భావిస్తామని, పాప పుట్టడంతో తమ సంతోషం రెట్టింపు అయిందని సాగర్, జాన్వీ వెల్లడించారు.