మలేషియా రాజధాని కౌలాలంపూర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. సెలాంగోర్ రాష్ట్రంలో ఉదయం 3 గంటల ప్రాంతంలో ఓ క్యాంప్ పై కొండచరియలు విరిగి పడి ఇద్దరు మృతి చెందారు. 50 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో మొత్తం 79 మంది క్యాంప్ లో ఉండగా అందులో 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. క్యాంప్ వెనుకాల ఉన్న కొండ 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు.