కృష్ణ జిల్లా మచిలీపట్నంలో గురువారం మచిలీపట్నం నుండి విజయవాడ వెళ్లే నాన్ స్టాప్ బస్సులను రద్దైన వాటి స్థానంలో నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల కాలంలో కాంట్రాక్టు బస్సుల కాలపరిమితి పూర్తి అవ్వటంతో వాటిని నిలిపుదల చేయటం జరిగింది.
నిత్యం మచిలీపట్నం నుండి విజయవాడ కు వేలాది మంది తరలించడంలో ఆర్టీసీ కి ప్రత్యేక స్థానం ఉంది. మచిలీపట్నం డిపో మేనేజర్ పెద్దిరాజు సమయస్ఫూర్తితో ప్రయాణికులు కి ఎటువంటి కష్టం లేకుండా సమన్వయం చేసుకుంటూ వాటి స్థానంలో వేరే బస్సులను పంపించడం జరుగుతుంది.
వివాహాలు ఫంక్షన్లో వంటి రద్దీ సమయాలలో ప్రయాణికులు తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల, కొత్త కాంట్రాక్టర్లను కలిసి కొత్త బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్టీసీకి భర్త ఆదాయం పెరిగే అవకాశం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు.