ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ప్రత్యక్ష సాక్ష్యాలు లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించవచ్చని తెలిపింది. 'ఫిర్యాదు దారుడు ఎదురుతిరిగినప్పుడు లేదా చనిపోయినప్పుడు ఇతర సాక్షుల మౌఖిక లేదా డాక్యుమెంటరీ సాక్ష్యాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగి మీద ఆరోపణలు నిరూపించవచ్చు' అని ధర్మాసనం పేర్కొంది. అవినీతి జరిగిందన్న దానికి ఆధారంగా ఉన్న ఇతరత్రా బలమైన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని లంచగొండి అధికారులను శిక్షించవచ్చు అని తెలిపింది.