భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడినట్లు పీఎంవో వెల్లడించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి చర్చలు మరియు దౌత్య ప్రక్రియలే ఏకైక మార్గమని భారత్ తన వైఖరిని పునరుద్ఘాటించిందని వివరించింది. దీంతోపాటు భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై కూడా ఇరువురు నేతలు సమీక్షించారు. ఇంధనం, విద్యుత్తు, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రతా సహకారం వంటి కీలక రంగాలపైనా చర్చించినట్లు వెల్లడించారు.