ఓ ఐదేళ్ల బాలిక చనిపోతూ మరొకరి జీవితంలో వెలుగులు నింపింది. యూపీలో చనిపోయిన ఓ చిన్నారి నేత్రాలను ఆమె తల్లిదండ్రులు దానం చేశారు. ఆగ్రాలో గురువారం ఉదయం వివేక్ అగర్వాల్ కుమార్తె కేతి అగర్వాల్ అకస్మాత్తుగా మరణించింది. అంతటి విషాదంలోనూ బాలిక తల్లిదండ్రులు పాప నేత్రాలను దానం చేయాలని నిర్ణయించుకుని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ వైద్యులను సంప్రదించగా వారు చిన్నారి కార్నియాలను తీసి భద్రపరిచారు. ఈ క్రమంలో ఆ చిన్నారి ఆగ్రాలో ఈ ఏడాది నేత్రదానం చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.