స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మోర్ముగావ్.. ఆదివారం భారత నౌకాదళంలో చేరనుంది. ముంబయిలోని నేవల్ డాక్ యార్డ్ లో జరిగే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారు. ఈ యుద్ధనౌక పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు, బరువు 7,400 టన్నులు కాగా భారత్ లో నిర్మించిన శక్తిమంతమైన యుద్ధనౌకల్లో ఒకటిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నౌక మన పోరాట సామర్థ్యాన్ని ఇనుమడింప చేయనుంది.