బీహార్ లో ఇటీవల కల్తీ మద్యం సేవించి చాలా మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ సంఖ్య 65కి చేరింది. బీహార్ లో ఆరేళ్ల క్రితం మద్యపానం నిషేదించారు. నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యానికి ఇంత భారీ స్థాయిలో ప్రజలు బలికావడం ఇదే తొలిసారి. మరో వైపు ఈ ఘటనపై హ్యూమన్ రైట్స్ కార్పొరేషన్ బీహార్ సీఎం నితీష్ కుమార్ కు నోటీసులు జారీచేసింది. కల్తీ మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని NHRC పేర్కొంది. కాగా, ఈ ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.