అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ బస్సు సేవలను ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రతిపాదిత బిల్లుకు చట్టసభ సభ్యులు అంగీకారం తెలపగా, డిసెంబర్ 20న కౌన్సిల్ సభ్యులు తుది ఓటింగ్ నిర్వహించనున్నారు. దీంతో 2023 నుంచి ఈ సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఇక కరోనా మహమ్మారి అనంతరం రోజువారీ ఖర్చులు పెరగడం, దీనికి తోడు ప్రయాణ ఛార్జీలు కూడా అధికమవడంపై అమెరికన్ల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో ప్రజా రవాణా సేవలను ఉచితంగా అందించడం లేదా ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు.