యూపీ మైన్ పురి జిల్లాలో లలూపూర్ గ్రామం. జిల్లా కేంద్రానికి కేవలం 5 కి.మీ దూరంలో ఉన్న ఈ గ్రామ జనాభా 2 వేలు. అయితే, గడిచిన 20 ఏళ్లలో గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు క్యాన్సర్ తో మరణించిన సంఘటనలే ఇక్కడ కనిపిస్తాయని గ్రామస్థులు చెబుతున్నారు. భూగర్భ జలాలు కలుషితమవడం ఆ నీటిని తాగడం వల్లే క్యాన్సర్ బారిన పడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. ఈ గ్రామంపై అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు రావడంతో 2006లో అప్పటి ప్రభుత్వం దవాఖానలో క్యాన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అయితే సేవలు అందడం లేదని అవి అందేలా చూడాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.