రాజస్థాన్‌లోని జాలోర్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ బాలికను హత్య చేశాడు. ఆహోర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల హజారిలాల్ హరిజన్ అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి వెంట ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆ బాలిక ప్రేమకు నిరాకరించటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈక్రమంలో ఆమెపై హజారిలాల్ పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.