బీహార్ లో కలకలం రేపిన కల్తీ మద్యం మరణాల ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు, ఆస్పత్రుల్లో చేరిన బాధితుల చికిత్స వివరాలు, వారికి ఇచ్చే నష్ట పరిహారం వంటి పలు అంశాలతో 4 వారాల్లో తమకు వివరణాత్మక నివేదిక అందజేయాలని కోరింది. ఘటనకు కారణమైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలంది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించిన కమిషన్ ఈ మేరకు నోటీసులిచ్చింది. మరోవైపు, ఈ వ్యవహారంపై బీహార్ ప్రభుత్వ ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది.