గుండె ఆగిపోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే అధునాతన సాంకేతికతను ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతతో ఈసీజీ టెస్టును విశ్లేషించి గుండె ఆగిపోయే ముప్పును ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. ప్రస్తుతం మైయోసైటిస్ బాధితుల కోసం దీన్ని వినియోగిస్తున్నారు. 2000 నుంచి 2020 మధ్య 89 మంది మైయోసైటిస్ బాధితుల ఈసీజీ రిపోర్టులు, మెడికల్ రికార్డులను పొందుపరిచి ఈ ఏఐ సాంకేతికతను రూపొందించినట్లు శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన డా.షహర్ పేర్కొన్నారు.