ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచంపై కోర్టు విచారణకు హాజరైన మహిళ

national |  Suryaa Desk  | Published : Sat, Dec 17, 2022, 11:43 AM

కర్ణాటకలో ఓ మహిళ కదలలేని స్థితిలో మంచంపైనే కోర్టుకు హాజరైంది. చామరాజనగర్ జిల్లా కొల్లెగల ప్రాంతంలో ముంతాజ్ బేగం అనే మహిళకు ముగ్గురు కుమార్తెలు, ఆరుగురు కొడుకులు. ఆమె భర్త చనిపోగా అతని నుంచి వచ్చిన 3.2 ఎకరాల భూమిని చిన్న కొడుకు అబ్దుల్ రజాక్ తీసుకున్నాడు. అడిగితే బెదిరించడంతో కోర్టును ఆశ్రయించింది. అనారోగ్యంతో 2 నెలలు ముంతాజ్ విచారణకు హాజరు కాలేదు. గురువారం విచారణకు రావాలని కోర్టు నుంచి నోటీసులు రాగా ఆమె కుమార్తెలు, బంధువుల సహాయంతో మంచంపైనే విచారణకు హాజరైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com