జంక్‌ఫుడ్స్‌తో ఊబకాయం సహా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయినా వాటిని తినకుండా ఉండలేరు కొందరు. కాబట్టి జంక్‌ఫుడ్ తినాలనే కోరిక కలగకుండా కొన్ని చిట్కాలు చెబుతున్నారు నిపుణులు. నీళ్లు తగిన మోతాదులో తీసుకుంటే ఆహార కోరికలు నియంత్రణలో ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ల మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు. మధ్య మధ్యలో కాస్త బాదం, వాల్‌నట్స్, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోండి. ప్రొటీన్ ఫుడ్ తింటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఆహారాన్ని బాగా నమిలి మింగడం వల్ల ఆహార కోరికలు తగ్గిపోతాయట. ఒత్తిడిని దూరం చేసుకోవడం, రాత్రి తగినంత నిద్రపోవడూ ఆ కోరికలను అదుపులో ఉంచుతాయి.