ఉత్తర్‌ప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. సెల్‌ఫోను చోరీ చేశారన్న అనుమానంతో ఓ పెళ్లిబృందం అయిదుగురు యువకులను కోల్డ్‌స్టోరేజి ప్లాంటులో 12 గంటలపాటు గొలుసులతో బంధించి నరకం చూపించింది. కమల్‌గంజ్ ఫంక్షన్‌హాలులో జరిగిన పెళ్లిలో కొంతమంది యువకులు వెయిటర్లుగా సేవలందించారు. పెళ్లికి వచ్చిన ఓ దంపతుల మొబైల్‌ఫోను అదృశ్యమైంది. దీంతో అర్ధరాత్రి 12.00 గంటల సమయంలో అయిదుగురు వెయిటర్లను నిలదీశారు. సమీప కోల్డ్‌స్టోరేజి ప్లాంటుకు వారిని తీసుకొచ్చి కాళ్లు, చేతులు గొలుసులతో బంధించి తీవ్రంగా కొట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో యువకులను విడిపించారు.