గుజరాత్ అహ్మదాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోటర్ పుర్ ప్రాంతం మంచినీటి శుద్ధి కర్మాగారంలోని వాటర్ ట్యాంక్ లో కొన్ని శరీర భాగాలు కనిపించాయి. శుక్రవారం ఉదయం పరిసర ప్రాంతాలకు మంచినీటిని అందించడానికి ఓ ఉద్యోగి చూస్తుండగా ట్యాంకులో కాళ్లు, చేతులు, తల భాగాలు కనిపించాయి. షాకైన ఉద్యోగి నీటి సరఫరా నిలిపేసి అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు శరీరభాగాలను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది ట్యాంకులో నీటిని నర్మదా నదిలో వదిలారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa