తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి సమాధి వద్ద కలం ఆకారంతో స్తూపం నిర్మించే పనులు నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. స్థానిక మెరీనా బీచ్ లోని కరుణానిధి సమాధి వెనుక వైపు కలం ఆకారంతో స్తూపం నిర్మించే ప్రాజెక్టును డీఎంకే ప్రభుత్వం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం రూ.87 కోట్ల మేర నిధులు కూడా కేటాయించింది. కాగా, ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తిరుచెందూరుకు చెందిన రాంకుమార్ ఆదిత్తన్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేశారు.