పులివెందుల పట్టణంలోని స్థానిక శ్రీ పద్మావతి సమేత లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతిరోజూ స్వామి, అమ్మవార్ల కు విశేష పూజలు, తిరుప్పావై నిర్వహిస్తామన్నారు. జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార ప్రవేశం, 14న శ్రీకృష్ణుడు, గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. కావున భక్తాదులు పాల్గొనాలని కోరారు.