పల్నాడు జిల్లా మాచర్లలో నిన్న వైసీపీ- టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిదే. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకులకు చెందిన ఇల్లు, వాహనాలను తగులబెట్టారు. ఈ హింస నేపథ్యంలో ఇప్పటికే 144 సెక్షన్ విధించిన పోలీసులు టీడీపీ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుతో పాటు నజీర్ అహ్మద్, కనపర్తి శ్రీనివాస్ ఇళ్లకు పోలీసులు తెల్లవారుజామునే చేరుకున్నారు. తెలుగుదేశం నేతలు పల్నాడుకు వెళ్తారన్న సమాచారంతో వారిని ఇళ్లలోంచి బయటికి రాకుండా ఆంక్షలు విధించారు. కాగా, మాచర్లలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా ఎస్పీ వెల్లడించారు.