రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి అన్నిరకాల సెలవులు వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం 5 నెలల కిందటే రెగ్యులర్ చేసింది కానీ, సెలవుల విషయంలో ఇప్పటివరకు ప్రొబేషన్ విధానమే అమల్లో ఉంది. దీంతో ఉద్యోగులు సాధారణ, ఐచ్చిక సెలవులే తీసుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల వినతితో ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సెలవులను వార్డు, పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులతో పాటు సచివాలయ ఉద్యోగులందరికీ ప్రభుత్వం వర్తింపజేసింది.