ఆధునిక యువత భవిష్యత్తులో భారత్‌ను ప్రపంచ ప్రతిభా కేంద్రంగా మారుస్తుందని నాస్‌కామ్ నివేదిక వెల్లడించింది. భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాల్లో చేరేందుకే జెనరేషన్ జడ్ (1990-2010 మధ్య జన్మించిన వారు) అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొంది. భారతీయ ఐటీ పరిశ్రమ గత ఆర్థిక సంవత్సరంలో 3.80 లక్షల మంది తాజా ఉత్తీర్ణులను నియమించుకుందని శుక్రవారం ఉద్యోగ నియామకాల సంస్థ ఇండీడ్‌తో కలిసి విడుదల చేసిన నివేదికలో నాస్‌కామ్ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 70 శాతానికి పైగా యువత ఐటీ ఉద్యోగాలు చేపట్టేందుకే ఆసక్తిగా ఉన్నారు. టెక్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా గణనీయ ఉద్యోగాల సృష్టి జరిగిందని, ఇందులో జెన్ జడ్ వాటా 18-20% ఉందని తెలిపింది.