కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని శనివారం నాడు ఏపీ ఎయిడ్స్ నియంత్రణ ప్రోగ్రాం ఫీల్డ్ ఆఫీసర్ రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రేమ్ ఔషధం వాడకం ద్వారా హెచ్ఐవి నివారణ సులభతరం అవుతుందని అన్నారు. ప్రేమ్ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదంతో ప్రవేశపెట్టామని రవికుమార్ పేర్కొన్నారు. దీని వాడకం వలన ఎటువంటి దుష్ఫలితాలు ఉండవని ఆయన తెలియజేశారు.