పదవి తీసుకున్నాక ప్రమాణస్వీకారం ఇప్పుడు పదవి విరమణ చేయటం తప్ప బీసీ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ ల వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ శనివారం నాడు పత్రికా ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్ లను ఈ రెండేళ్లలో సీఎం జగన్ ఏం పని చేయనివ్వలేదని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. 56 మంది కార్పొరేషన్ చైర్మన్ లను ఉత్సవ విగ్రహాలను చేసినందుకు జగన్ ను బీసీలు నమ్మాలా అని ఎమ్మెల్యే రవికుమార్ ప్రశ్నించారు. కార్పొరేషన్ లకు రూపాయి బడ్జెట్ కేటాయించకుండా నాశనం చేశారని ఆయన మండిపడ్డారు.